27 June, 2026 | 3:59 AM

ప్రేక్షకులకు షాకిచ్చే మర్డర్ మిస్టరీ

27-06-2026 12:00 AM

దినేశ్ తేజ్, దష్విక కే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘తత్వం’. ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్లపై వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో దినేశ్ తేజ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు.

అలాంటి బలమైన కంటెంట్‌తో రానున్న ‘తత్వం’ను ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా” అన్నారు. దర్శకుడు అర్జున్ కోలా మాట్లాడుతూ.. “ఈ మూవీ టైటిల్, కాన్సె ప్ట్‌ను మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా తయారుచేసుకున్నా. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇది. కథ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది” అని చెప్పారు.

నిర్మాత శ్వేత పసుపులేటి మాట్లాడుతూ.. “టైటిల్‌కు తగ్గట్టు చాలా విభిన్నంగా ఉంటుందీ చిత్రం. ఓ కొత్త సినిమాను చూశామన్న అనుభూతికి లోనవుతారు” అ న్నారు. ‘అందరూ ఈ సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాన’ని చెప్పారు మరో నిర్మాత వంశీ సీమకుర్తి. ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ నైషదం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత భరత్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.