13 May, 2026 | 12:35 PM

Breaking News

విజయ్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

16-12-2025 06:54 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 17న ఉదయం 7 గంటల నుంచి జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర పడగా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి పహారాను ఏర్పాటు చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లోని 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మూడో విడతలో మొత్తం 4,159 సర్పంచ్ స్థానాలకు 394 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.  3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీపడగా, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  అలాగే 36,425 వార్డులకు గాను 7,908 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 11 గ్రామ పంచాయతీల్లో, 116 వార్డులో నామినేషన్లు దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరో రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.