10 June, 2026 | 2:18 PM

Breaking News

తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •   రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో రత్నాపూర్ విద్యార్థుల సత్తా   •   సిద్దాపూర్ రిజర్వాయర్ కు చేరుకున్న మంత్రి ఉత్తమ్   •  

తృతీయ వార్షిక ఏకాదశి యజ్ఞం ప్రారంభం

03-10-2025 11:00 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో గత రెండు సంవత్సరాలు ఏకాదశి మహా యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని నేడు తృతీయ వార్షిక ఏకాదశి మహా యజ్ఞాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, శశిరేఖ దంపతుల ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం యజ్ఞాన్ని నిర్వహించి తీర్థ ప్రసాద పంపిణీ చేశారు. ఎంతో ముక్తిని ప్రసాదించి ఏకాదశి మహా యజ్ఞం ఏడాది పాటు నిర్విఘ్నంగా నిర్వహించడం విశేషమని భక్తులు యాగంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని పూజారి తెలిపారు. ప్రతిపక్షం రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి హోమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల భక్తులు తమను సంప్రదించాలని పూజారి తెలిపారు.