కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు
* మార్కెట్ డైరెక్టర్ సంపత్ కుమార్
ఆమనగల్లు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీర్ఘకాలిక ఆలోచన (లాంగ్ విజన్)తో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’తో కల్వకుర్తి నియోజకవర్గానికి, ముఖ్యంగా స్థానిక మండలాలకు ఎంతో భవిష్యత్తు లభించబోతోందని ఆమనగల్ మార్కెట్ డైరెక్టర్ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. కాలుష్య కారక ఫార్మా సిటీని రద్దు చేసి, యువత మరియు విద్యార్థుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మల్టీపుల్ కంపెనీలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడం సీఎం రేవంత్ రెడ్డి గారి అద్భుతమైన నిర్ణయమని ఆయన కొనియాడారు.
బుధవారం ఆమనగల్ పట్టణంలో ని రైతు వేదికలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ఆమనగల్ మార్కెట్ డైరెక్టర్ సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ వల్ల కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండేదని ఆయన గుర్తు చేశారు.రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీని రద్దు చేసి, దాని స్థానంలో పర్యావరణ హితమైన, అత్యాధునిక 'ఫీచర్స్/ఫ్యూచర్ సిటీ'ని తీసుకురావడం గొప్ప విషయమన్నారు.
రాబోయే తరాల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మాడ్గుల, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి మండలాల పిల్లల కెరీర్ కోసం సీఎం ఈ లాంగ్ విజన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రాబోయే మల్టీపుల్ కంపెనీలు, ఫోర్స్ (ఏఐ /టెక్నాలజీ) రంగాల వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ఆయన చెప్పారు.ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల మాడ్గుల, ఆమనగల్ మండలాల ప్రజలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గ రైతులు, విద్యార్థులు సంపూర్ణ సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని సంపత్ కుమార్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాకు ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.






