10 June, 2026 | 2:05 PM

షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!

10-06-2026 01:03 PM

బ్యాంకు వద్ద ఖాతాదారుల నిరీక్షణ

గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బుధవారం జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగదు లావాదేవీలు, డిపాజిట్లు, ఇతర సేవలు ఆగిపోవడంతో గ్రామాల నుంచి వచ్చిన రైతులు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి బ్యాంకు వద్ద వేచి చూడాల్సి వచ్చింది.

సాంకేతిక లోపంతో సేవలు నిలిపివేసినట్లు బ్రాంచ్ మేనేజర్ రమేష్ తెలిపారు. సమస్య పరిష్కారానికి పనులు వేగవంతం చేసేందుకు మెకానిక్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరమ్మతులు పూర్తికాగానే సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అవసరమైతే గురువారం ఉదయం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులో సేవలు నిలిచిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సమస్యను త్వరగా పరిష్కరించాలని ఖాతాదారులు కోరుతున్నారు.