అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు
ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రూప నాయక్
ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): తెలంగాణలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల లో (ఐటీఐ) అడ్మిషన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించినట్లు ఎల్లారెడ్డి ఏటీసీ సెంటర్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రూప నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆగస్టు విద్యా సంవత్సర ప్రవేశాల కోసం గతంలో జూన్ 8వ తేదీ వరకు ఉన్న దరఖాస్తు గడువును జూన్ 30, 2026 వరకు పొడిగించినట్లు.ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, అధికారిక వెబ్‌సైట్ ఐటిఐ అడ్మిషన్ తెలంగాణ స్టేట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు.
గత నోటిఫికేషన్‌ల ప్రకారం ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు: దరఖాస్తు రుసుము: ₹100 లు అందుబాటులో పలు రకాల కోర్సులు: ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి ప్రక్రియ, దరఖాస్తు విధానంపై మరింత అవగాహన కోసం ఎల్లారెడ్డి.ఐటీఐ ఏటీసీ అడ్మిషన్ సెంటర్లో సంప్రదించవచ్చని అన్నారు, ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తమ ఎస్ఎస్సి మెమోలో ఉన్న తండ్రి పేరుని పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. ఎస్ఎస్సి మెమో, ఆధార్ కార్డు ఒకే విధంగా ఉండే టట్లు చూసుకోవాలి. దరఖాస్తులు పొందుపరచు మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి కోర్స్ పూర్తయ్యేలోపు మార్చుకోరాదని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి మరిన్ని వివరాలకు వెబ్సైట్ను చూడాలని కోరారు. ఆయన వెంట ఏటీవో శేఖర్, తో పాటు ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు.






