15 June, 2026 | 2:31 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

భార్యను కాల్చి చంపిన భర్త

10-06-2026 01:33 PM

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పరిధిలో బుధవారం తెల్లవారుజామున కల్పుల కలకలం సృష్టించాయి. మల్కాజిగిరి పరిధిలోని మారుతినగర్‍లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు.  వివరాల్లోకి వెళ్తే.. అరుణ్‌, నిషారాణి అనే దంపతులద్దరూ మల్కాజ్‌గిరిలోని మారుతీ నగర్ లో నివాసం ఉంటున్నారు. అరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున సమస్యల మాట్లాడదామని నిషారాణిని పిలవగా, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరో వ్యక్తితో కలిసి భర్త అరుణ్‌ తన వద్ద దాచుకున్న తుపాకీతో భార్యపై కాల్పలు జరిపాడు. ఈ ఘటనలో నిషారాణి అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

సుమారు మూడు నెలల క్రితం అంబర్‌పేట పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో తుపాకీతో అరుణ్ పట్టుకున్నారని విచారణలో తేలింది. అంబర్‌పేటలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఇ తుపాకీ, 6 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు గతంలో వెల్లడించారు. అప్పుడు మాల్కాజిగిరికి చెందని అరుణ్ కుమార్ తన రెండో భార్య హత్య చేసేందుకు బీహార్ నుంచి తూపాకీని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలింది. ఆ ఘటనకు, ప్రస్తుత సంఘటనకు ఏమైనా సంబంధం ఉందేమోనని అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేరానికి పాల్పడటంలో అరుణ్‌కు మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సహచరుడిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.