అద్భుతంగా ఆడారు
టెస్ట్ క్రికెట్‌కు ఇదే కావాలి
ఆటగాళ్ళ పోరాటం బాగుంది
భారత జట్టుపై గంభీర్ ప్రశంసలు
లంకతో సిరీస్ విజయంపై ట్వీట్
కొలంబో, ఆగస్టు 28 : వరల్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్ప క గెలవాల్సిన శ్రీలంక సిరీస్‌లో భారత్ 1-0 తో విజయం సాధించింది. అయితే 2-0తో సిరీస్ గెలిచే అవకాశం లంక అద్భుత పోరాటంతో చేజారిపోయింది. ఈ నేపథ్యంలో భా రత్ వ్యూహాలపై విమర్శలు వచ్చాయి.
హెడ్ కోచ్ గౌతం గంభీర్ మాత్రం తన వ్యూహాల ను పరోక్షంగా సమర్థించుకున్నాడు. భారత్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించా డు. ఈ విజయంపై స్పందిస్తూ ట్వీట్ చేశా డు. టెస్ట్ క్రికెట్‌కు క్యారెక్టర్, సహనం, మానసిక దృఢత్వం చాలా అవసరమని, మన ఆటగాళ్లు చివరి వరకు పోరాడి అదే నిరూపించారని అన్నారు.
రెండో టెస్టులో అద్భుత మైన బ్యాటింగ్‌తో మ్యా చ్‌ను డ్రా చేసిన శ్రీ లంక ఆటగాడు సోనాల్ దినుషాను ప్రత్యేకంగా అభినందించాడు. తొలి టెస్టులో భా రత్ ఘనవిజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. ఈ సిరీస్ ఫలితం తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది.
కాగా కొలంబో టెస్టులో ఫాలో ఆన్ వ్యూహం బెడిసికొట్టిందన్న విమర్శలపై మాత్రం గంభీర్ నేరుగా స్పందించలేదు. టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటామని, ఒక్కోసారి ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చంటూ వ్యాఖ్యానించాడు. హెడ్ కోచ్‌గా గంభీర్ వ్యూహాలపై మొదటి నుంచీ విమర్శ లు వస్తున్నాయి. ముఖ్యంగా స్వదేశంలో భారత జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయా లు గంభీర్ కోచింగ్ శైలిని ప్రశ్నార్థకం చేశాయి.
గంభీర్ హయాంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో (0-3), దక్షిణాఫ్రికా చేతిలో (0-2) ఘోరమైన టెస్ట్ సిరీస్ ఓ టములను చవిచూసింది. ఒకే కోచ్ హ యాంలో స్వదేశంలో రెండు టెస్ట్ సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడం భారత క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. శ్రీలంకతో జరిగిన తాజా సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రతికూలంగా ముగిసినప్పుడు గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రాకుండా ముఖం చాటేశారని, కేవలం గెలిచినప్పుడు మాత్రమే ప్రగల్భాలు పలుకు తారని మాజీలు విమర్శలు గుప్పించారు.






