29 May, 2026 | 8:02 PM

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించే బోర్డులు ఉండాలి

29-05-2026 04:37 PM

బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు

ముకరంపుర, మే 29(విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలల యందు నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు  ఫీజులు నియంత్రించే బోర్డులు  ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ, అనుబంధ సంఘాల నాయకులు దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి  మరియు క్రాంతి  కలిసి ఉన్నత విద్యాధికారిని ఏడి మాధవి కి వినతిపత్రం ఇచ్చారు.

అనంతరం వారు మాట్లాడుతు అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ల ఫీజు , సంవత్సర టర్మ్ ఫీజు చెల్లించే విధాన ప్రక్రియ సులభంగా ఉంటుందని వారు తెలిపారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అధికారి పార్టీకి చెందిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  ప్రైవేట్  పాఠశాలల్లో ఫీజుల దోపిడీ గురించి ప్రస్తావించి దానిని అరికట్టే విధంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారని ఉన్నత విద్యాధికారిని కి  తెలిపారు. ఉన్నత విద్యాధికారిని సానుకూలంగా స్పందిస్తూ ఫీజులు నియంత్రించే బోర్డులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి లేఖ పంపిస్తామని తెలిపారు.