23 April, 2026 | 3:05 AM

నాడు ఎస్జీటీ.. నేడు ప్రిన్సిపాల్

23-04-2026 02:00 AM
  1. ఉద్యోగాల విజయలక్ష్మి 
  2. ఎస్జీటీ స్థాయి నుంచి కళాశాల ప్రిన్సిపాల్ వరకు..

నిర్మల్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఆదుముల్ల విజయలక్ష్మి ఉద్యోగాల విజయలక్ష్మిగా పేరు తెచ్చుకుంది. చిన్నప్పటినుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన ఆమె ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేసింది. 2023లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికై వేమనపల్లి మండలంలో ఉపాధ్యాయురాలుగా విధుల్లో 2005లో చేరింది. 2007లో జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా ఎంపికై బోథ్ జూనియర్ కళాశాలలో జంతు శాస్త్రం లెక్చరర్‌గా ఎంపికైంది.

అక్కడ నిధులు నిర్వహిస్తూనే నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించింది.2016 నుంచి 18 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డిగ్రీ కళాశాలలో పనిచేసిన ఆమె తిరిగి జూనియర్ బాలికల జూనియర్ కళాశాలలో ప్రమోషన్ కోసం చేరింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.