23 April, 2026 | 3:05 AM

తీర్పుపై సుప్రీంలో అప్పీల్ చేయాలి

23-04-2026 02:01 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని, ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల వెనుక ఉన్న దోషులు ఎవరైనా సరే, వారికి చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఈమేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ మొత్తం పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

కాళేశ్వరం ప్రాజె క్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసి న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం గమనార్హమ న్నారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఈ స్టే రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, తప్పిదాలు చేసిందని స్పష్టమవుతోం దన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విధివిధానాలు, విచారణలో నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రా యపడిందన్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటి షనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదే శించిదన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవి నీతి, అక్రమాల విషయంలో అసలు అవినీతి పరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్లు స్పష్టమవుతోందన్నారు.