26 August, 2026 | 6:31 PM

పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

26-08-2026 05:49 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించనున్నట్లు బూర్గంపాడు ఎస్‌హెచ్‌ఓ మేడ ప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని సూచించారు.

సెప్టెంబరు 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి ఉచిత శిక్షణతో పాటు ఉచిత రెసిడెన్షియల్‌ సౌకర్యం కల్పించి పోలీస్‌ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. స్టేషన్‌ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.