రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి
26-08-2026 05:44 PM
కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్చార్జి భూక్య సంజీవ్ నాయక్ బుధవారం పరామర్శించారు. ఆయన వారి బంధువులను ఓదార్చినారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ దశరథని కలిసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నియోజకవర్గ కన్వీనర్ ఏనుగుల ఎల్లేశ్వరరావు, శైలజ కోదాడ మండల అధ్యక్షుడు చెడపంగు ఉపేందర్ ఉపాధ్యక్షుడు పాముల శివ పట్టణ నాయకులు తోట శ్రీనివాసరావు గొట్టముక్కల శ్రీనివాసరావు ఉన్నారు.






