26 August, 2026 | 6:31 PM

నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ శంకుస్థాపన

26-08-2026 05:47 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని చెన్నాయిపాలెం, కిండితండా గ్రామ పంచాయతీ నూతన భవనాలు, అంగన్వాడి భవనాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ గ్రామ సర్పంచుల, కార్యకర్తల సమక్షంలో బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  సహకారంతో మండలంలో ఉన్న అన్ని గిరిజన తండాల గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మాలోతు జ్యోతి శ్రీను నాయక్, భూక్య రవీందర్ నాయక్, ఉపసర్పంచ్లు భూక్య నాగు నాయక్, బానోతు రాంబాయి నాగు నాయక్, తులసి రామ్ నాయక్, నాగు నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాలోతు మేఘ నాయక్ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.