ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
ప్రధాన విధుల్లో ముస్లిం సోదరుల ర్యాలీ
చేగుంట , ఆగస్టు 26,(విజయక్రాంతి): చేగుంట పట్టణంలో పవిత్ర మిలాద్ ఉన్ నబీ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ర్యాలీతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ర్యాలీలో చిన్నారులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, ప్రేమ, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రజలకు చాటుతూ ర్యాలీ కొనసాగింది. .పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధుల గుండా ర్యాలీ కొనసాగడంతో చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం లొ మస్జీద్ సదర్ మొహమ్మద్ షకీల్, నాయబ్ సదర్ మొహమ్మద్ రహిమోద్దీన్, కమిటీ సభ్యులు షేక్ గౌస్,మొహమ్మద్ జాలిల్, మొహమ్మద్ అరిఫ్, మస్జీద్ ఇమామ్ అన్వర్ ఉల్ హాక్, అజీమ్, మొజామ్మిల్ తదితరులు పాల్గొన్నారు.






