26 August, 2026 | 6:12 PM

ప్రమాదకరంగా మారిన 11 కేవీ విద్యుత్ తీగలు

26-08-2026 05:31 PM

పట్టించుకోని కాంట్రాక్టర్, అధికారులు

సిర్గాపూర్ ఆగస్టు 26(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివారులోని బాబు కుంటలో, పలు ప్రాంతాల్లో 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు కిందికి వేలాడుతుండటంతో ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు, గాలులు వీచే సమయంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగకముందే 11 కేవీ విద్యుత్ తీగలను సరిచేసి, ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.