26 August, 2026 | 8:38 PM

నీరుకుల్ల గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేయాలని పాలకవర్గం తీర్మానం

26-08-2026 05:26 PM

సుల్తానాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో కొనసాగుతున్న బెల్ట్ షాపులను మూసివేయాలని పాలకవర్గం,  గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు గ్రామంలోని బెల్ట్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు, బెల్ట్ షాపుల కారణంగా గ్రామంలో ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు , యువతకు ఇబ్బందులు కలగకుండా గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ కంపెళ్లి సతీష్ కుమార్ బుధవారం తెలిపారు, గ్రామ ప్రజల అభ్యర్థనను, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుందని, సంబంధిత అధికారులు కూడా సహకరించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు..