14 March, 2026 | 12:03 AM

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చోరీ

13-03-2026 12:00 AM

సీసీ ఫుటేజీలతో నిందితురాలి కోసం పోలీసుల గాలింపు

సికింద్రాబాద్,మార్చి 12 (విజయక్రాంతి): డాక్టర్ వేషధారణలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోకి ప్రవేశించి పేషెంట్ ఒంటిపై ఉన్న బంగారాన్ని అపహరించిన ఘటనలో మార్కెట్ పోలీసులు పురోగతి సాధించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈఘటన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని భద్రత డొల్లతనాన్ని బయట పెట్టిందని భావిస్తున్నారు.

సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం బయట నుంచి స్టెతస్కోప్,యాప్రాన్ ధరించి డాక్టర్ల వేషధారణలో వచ్చిన ఓ కిలాడి లేడీ నేరుగా ఆసుపత్రిలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అనం తరం నర్సింగ్ స్టాఫ్ రూమ్లోకి వెళ్లి కొన్ని ఇంజెక్షన్లు తీసుకుని బయటకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అక్కడ ఉన్న సిబ్బంది లేదా భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకోకపోవడంతో అదే వేషధారణలో పేషెంట్ ఓల్ బోయిన్ పల్లికి చెందిన సుధరాణి ఉన్న గదిలోకి వెళ్లింది.

పరీక్షలు చేయా ల్సి ఉందని చెప్పి కుటుంబ సభ్యులను బయటకు పంపించి, పేషెంట్ వద్ద ఉన్న సుమారు పది తులాల బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి పరారైంది.ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమె వచ్చిన మార్గంతో పాటు బయ టకు వెళ్లిన దారిని పరిశీలిస్తూ రెండు బృం దాలతో నిందితురాలి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది సహ కారంతోనే సదరు కిలేడీ డాక్టర్ వేషం లో వచ్చి రోగి వద్ద భారీ దోపిడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

సిబ్బంది సహాకారం లేనిది సదరు కిలేడీ ఆసుపత్రి లోని పేషంట్ రూం లోకి ప్రవేశించి, మత్తు మందు ఇచ్చే సాహసం చేయలేదని భావిస్తున్నారు. పేషం ట్ల నుంచి లక్షలాది రూపాయలను ముక్కుపిండి వసూలు చేసే ఆసుపత్రి నిర్వాహకులు ఆసుపత్రి లోపల కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీ సుల విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని మార్కెట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.రాంచందర్ తెలిపారు.