యువతే పార్టీకి వెన్నెముక
- గ్రామ స్థాయి నుంచి పోరాట స్ఫూర్తిని పెంచాలి
- టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాం తి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగం తో టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యం లో రాష్ట్ర, జిల్లా నాయకులతో పార్టీ విస్తర ణ, యువత పాత్ర, భవిష్యత్ కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భం గా మల్లన్న మాట్లాడుతూ.. యువతే సమా జ మార్పుకు అసలైన శక్తి అని అన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రతి గ్రామం, ప్రతి ఊ రు, ప్రతి కళాశాలకు తీసుకెళ్లే బాధ్యత యు వజన విభాగంపైనే ఉందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువజన కమిటీలను బ లోపేతం చేయాలని ఆదేశించారు.
సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగి స్తూ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గంగాధర్ లింగాల, ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, స్టేట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ లింగం యాదవ్ పాల్గొన్నారు.






