9 May, 2026 | 10:14 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

డిజిటల్ విప్లవంతో మారిన ప్రపంచ గతి

27-02-2026 12:20 AM

మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ముకరంపుర, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): డిజిటల్ విప్లవంతో ప్రపంచ గతి మారిపోయిందని టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం కరీంనగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో వి సాయి సుమంత్ నేతృత్వంలో నూతనంగా రూపొందించిన పల్లె యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిందని, స్థానిక వార్తలతోపాటు దేశ, అంతర్జాతీయ వార్తలు, విశేషాలను అప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నామన్నారు.

ర్తమానాన్నే కాదు భవిష్యత్తును కూడా ప్రభావితం చేసేంతంగా ఇంటర్నెట్ మార్పు తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్ని డిజిటల్ మయంగా మార్చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి, కరీంనగర్ నియోజవర్గ మాజీ ఇంచార్జీ పురమల్ల శ్రీనివాస్, 27వ డివిజన్ కార్పొరేటర్ శ్యా మల కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కొండ సత్యలక్ష్మి గార్డెన్స్లో జరిగిన కే.ఎస్. అనంతాచార్య కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.