9 May, 2026 | 9:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కార్మికులకు సేఫ్టీ కిట్స్ వెంటనే అందించాలి

27-02-2026 12:20 AM

సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ 

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 26: మున్సిపల్ కార్మికులకు అందించాల్సిన సేఫ్టీ కిట్లను వెంటనే అందించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నరసింహా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాగోల్ సర్కిల్ కుంట్లూరు 51, పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్ లలో పనిచేస్తున్న కార్మికులకు అందాల్సిన సేఫ్టీ కిట్లను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్ పేట్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.

అనంతరం నాగోల్ సర్కిల్ ఏఎంసీ కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పుల నరసింహ మాట్లాడుతూ... నాగోల్ సర్కిల్ కుంట్లూరు 51 డివిజన్, పెద్ద అంబర్ పేట్ 52 డివిజన్ పరిధిలో పనిచేసే కార్మికులకు వెంటనే సేఫ్టీ కిట్లు అందజేయాలన్నారు. గత ఏడాది పెండింగ్ లో ఉన్న సబ్బులు నూనెలు, డ్రెస్సులు, చెప్పులు ,బెల్లం గ్లౌజులు ఇవ్వాలని కోరారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వలన కార్మికులకు అందాల్సిన సేఫ్టీ కిడ్స్ అందడం లేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కార్మికులకు సేఫ్టీ కిట్స్ ఇచ్చినప్పటికీ... నాగోల్ సర్కిల్ పరిధిలో పనిచేసే కార్మికులకు ఎందుకు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. 2024లో ఆరు నెలలకు ఇచ్చి... మరో ఆరు నెలలు మరిచిపోయారని విమర్శించారు. డిప్యూటీ కమిషనర్ తో చర్చించి కార్మికులకు అందించాల్సిన సేఫ్టీ కిట్స్ ను వెంటనే అందజేస్తామని ఏఎంసీ కిరణ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు శివకుమార్, మహేష్, కార్మికులు మైసయ్య, మహిపాల్, మాధవి, పోచమ్మ,జగన్, పద్మ, కార్మికులు అధికారులు పాల్గొన్నారు.