కార్మికుల శ్రేయస్సే కాంగ్రెస్ విధానం
రాజేష్ కుమార్ అగర్వాల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం
ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కార్మికుల శ్రేయస్ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పాటుపడుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు అన్నారు. మే డే సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వందమందికి పైగా శానిటేషన్ కార్మికులను పీసీసీ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చైర్మన్ రాజేష్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.
వారికి టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్స్, వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ రాజేష్ కుమార్ అగర్వాల్ లింగిస్టిక్ మైనార్టీ సెల్ చైర్మన్‌గా బాధితులు తీసుకున్న తర్వాత నుంచి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. సామాజిక సేవ కోసం అంకితభావంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నారని వీహెచ్ పేర్కొన్నారు.
రాజేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నాయకులు, బా నిస కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో శానిటేషన్ కార్మికులు చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. శానిటేషన్ కార్మికులను గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో స్థాని క నాయకులు అంజి యాదవ్, లక్ష్మణ్ వర్మ, నాగరాజు, నర్సింగ్‌రావు, రఘువీర్, గంగాధర్, రాముల ముదిరాజ్, శ్రీనివాస్, సాయి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు.






