17 August, 2026 | 10:26 AM

ఆది మల్లికార్జున స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు

17-08-2026 09:25 AM

కుటుంబ సభ్యులను చల్లగా చూడలని నాగ దేవతను వేడుకుంటూ ప్రత్యేక పూజలు

ముత్తారం, ఆగస్టు 17 (విజయ క్రాంతి): ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలోని శ్రీ ఆది మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద సోమవారం నాగుల పంచమి పూజలు(Nagula Panchami celebrations) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులను సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని మహిళలు నాగదేవతను వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.

నాగుల పంచమిని పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లోని పుట్టల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుట్టలకు పసుపు, కుంకుమ సమర్పించి, పాలు పోసి నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని, ఇంటిల్లిపాదీ సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించారు. నాగదేవతకు నైవేద్యాలు సమర్పించడంతో పాటు ప్రతి ఏటా నిర్వహించే నాగుల పంచమి వేడుకలను ముత్తారం,  పారుపల్లి గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.