ఉత్తరాఖండ్‌లో వేదికను శుద్ధి చేశారు
- నా ప్రసంగం తర్వాత ఘటన
- బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయండి
- రాజ్యసభలో మల్లికార్జున్‌ఖర్గే
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో తాను ప్రసంగించిన రామ్‌లీలా మైదాన్‌లోని వేదికను బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు శుద్ధి చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. వారిపై అస్పృశ్యత నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, వారిని అరెస్టుచేసి జైలుకు పంపాలని డిమాండ్‌చేశారు. ఈ చర్యను కేంద్రమంత్రి నడ్డా కూడా ఖండించారని ఖర్గే పేర్కొన్నారు. రాజ్యసభలో ఖర్గే గురువారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీంతో సభలో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యులు నినాదాలుచేశారు. నడ్డా మాట్లాడుతూ, బీజేపీ ఇటువంటి చర్యలను సమర్థించదని, ఈ ఘటనపై విచారణ జరుపుతామన్నారు. తాను ఏ మతాన్ని లేదా సామాజికవర్గాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ, బీజేపీకి చెందిన వ్యక్తులు వేదికను ‘శుద్ధి‘ చేశారని చెప్పారు.
బహిరంగ సభలో ‘నేను కేవలం ప్రజల సమస్యల గురించే మాట్లాడాను’ అని, అనంతరం బీజేపీ వ్యక్తులు అక్కడ హవనం నిర్వహించి, వేదికను శుద్ధి చేశారని తెలిపారు. వారు తనను అవమానించారని స్పష్టంచేశారు. దీంతో ఖర్గే లేవ నెత్తిన అంశంపై స్పందించాలని చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ నడ్డాను కోరారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. ‘ఇది కాంగ్రెస్‌కే కాదు, మనందరికీ చాలా బాధాకరం. బీజేపీ ఈ చర్యలను సమర్థించదు’ అని అన్నారు.






