ఎర్రకోట వద్ద పేలుడు అల్‌ఖైదా కుట్రే
- యూఎన్‌ఎస్‌సీ ధ్రువీకరించి నివేదిక విడుదల
- బంగ్లా స్థావరంగా భారత్‌పై దాడులకు ప్లాన్
న్యూయార్క్, ఆగస్టు 13: ఢిల్లీ ఎర్రకోట వద్ద గతేడాది జరిగిన పేలుడుకు అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థే కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎ న్‌ఎస్‌సీ) ధ్రువీకరించింది. గురువారం ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. అల్‌ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్)కు సంబంధం ఉందని పేర్కొ ంది. ఈ విషాదకర ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. చిన్న బృందంగా ఉన్న ఏక్యూఐఎస్ ప్రాంతీయ ఉగ్రవాద సంస్థగా ప్రస్తుతం రూపాంతరం చెందుతోందని తెలిపింది. అల్‌ఖైదా, ఐసీస్ వంటి ఉగ్రవాద సంస్థలు రసాయన, జీవాయుధాల తయారీపై చాలాకాలంగా ఆసక్తి చూపుతున్నాయని స్పష్టం చేసింది.
ఫిబ్రవరిలో బోటులినమ్ టాక్సిన్, సైనైడ్ వంటి విషపూరిత పదార్థాలను తయారుచేసే సూచనలున్నాయని ఓ ఆంగ్ల పత్రిక కూడా పేర్కొంది. భారత సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌ను తమ స్థావరంగా మార్చుకొని, అక్కడి నుంచి ఉగ్రముఠాలను బలోపేతం చేస్తూ భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తోందని యూఎన్‌వో వెల్లడించింది.
ఇందుకోసం లాజిస్టికల్, ఆర్థిక నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించింది. 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెం దగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. తొలుత విచారణ చేపట్టిన పోలీసులు తరువాత కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. ఈ పేలుడుకు కారణ మైన 8 మంది ఉగ్రవాదులలో ఐదుగురు వైద్యులే కావడం గమనార్హం. ఈ కేసులో 11 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.






