22 July, 2026 | 2:45 AM

వేదాలు సనాతన ధర్మానికి మూలస్తంభాలు

22-07-2026 02:17 AM

విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 

వేములవాడ, జులై 21, (విజయ క్రాంతి): వేదాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత వేదశాస్త్ర, స్మార్త, ఆగమ విద్వత్ సదస్సు, వేదస్మార్త పరీక్షా మహోత్సవాలను మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా భీమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, వేదాలు సనాతన ధర్మానికి మూలస్తంభాలని పేర్కొన్నారు.

భావితరాలకు వేద విద్యను అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఈ నెల 30, 31 తేదీలు, ఆగస్టు 1న నిర్వహించే వరుణ యాగం ద్వారా సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించనున్నట్లు తెలిపారు.