యూరియా యాప్‌ను రద్దు చేయాలి
03-04-2026 12:46 AM
ఎల్లారెడ్డి ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో యూరియా యాప్ ద్వారా యూరియా సంచులను కొనుగోలు చేయడం పట్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళిక గ్రామ సభలో భాగంగా గ్రామస్తులు రైతులు యూరియా యాప్ ను పూర్తిగా ఎత్తివేయాలని ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు తీర్మానం చేశారు.
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామపంచాయతీ ప్రజలు ప్రభుత్వం తలపెట్టిన యూరియా యాప్ ను రద్దుచేసి ప్రజలకు మేలు కలిగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పటేల్ సాయిలు గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి సంబంధిత శాఖ అధికారులు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.




