ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి
ముషీరాబాద్, మార్చి 29(విజయక్రాంతి): యుద్ధ వ్యతిరేక ప్రదర్శన చార్మినార్ నుండి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఆదివారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తు న్న దుర్మార్గపూరిత యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ప్రొఫెసర్ కోదం డరాం అధ్యక్షతన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ సభను నిర్వహించారు.
ఈ సభలో ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు జమాతే ఇస్లాం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ నాయకులు ఎం. సిపిఐ యువ నాయకులు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజా స్వామ్యవాదులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, రైతు కూలీ నాయకులు, విద్యా ర్థి సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, అన్ని రంగాలలోని విద్యావేత్తలు, ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్. ఎల్లి కృష్ణ, న్యూ డెమోక్రసీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి విజయ్, ప్రగతిల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు మద్దెల సరళ, పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. గణేష్, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు కె. వంశీ జిల్లా నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




