18 May, 2026 | 5:35 PM

మేడిపల్లిలో ఉన్న రెండు భారీ ట్యాంకులను నింపాలి

18-05-2026 04:51 PM

తాగునీటి సమస్యలను పరిష్కరించాలని హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అధికారులకు వినతిపత్రం అందజేసిన తుంగతుర్తి రవి 

మేడిపల్లి మే 18 (విజయక్రాంతి): మేడిపల్లి లో ఉన్న రెండు భారీ ట్యాంకులను నింపి, మేడిపల్లి, పీర్జాదిగూడ పరిధిలోని తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడిపల్లి,పీర్జాదిగూడ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  తుంగతుర్తి రవి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, జనరల్ మేనేజర్  సంతోష్ కుమార్ కు, డీజీఎం సరిత కు ఉప్పల్ జోన్ హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయం లో వినతిపత్రం అందజేశారు. ​

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వినతిపత్రంలో ప్రధాన సమస్యలైన మేడిపల్లిలో ఉన్న రెండు భారీ రిజర్వాయర్ ట్యాంకులను పూర్తిగా నింపి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని,​ మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో జరుగుతున్న నీటి లీకేజీలను అరికట్టాలని, కాలం చెల్లిన పాత పైప్‌లైన్ల స్థానంలో నూతన పైప్‌లైన్లను రీప్లేస్ చేయాలని కోరారు. ​తాగునీటి సౌకర్యం లేని పలు కాలనీలను గుర్తించి, అక్కడ కొత్తగా తాగునీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేయాలని జీఎం ని కోరారు. ఈ కార్యక్రమం లో సోమయ్య, బర్రె నాగరాజు,పద్మ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.