18 May, 2026 | 5:41 PM

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

18-05-2026 04:53 PM

కమిషనర్‌ కు వినతి పత్రం అందజేసిన తోటకూర వజ్రేష్ యాదవ్,తోటకూర అజయ్ యాదవ్, కొత్త కిషోర్ గౌడ్

మేడిపల్లి మే 18 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ తో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా కమిషనర్ తో చెంగిచెర్ల,బోడుప్పల్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.