09-02-2026 12:21:45 AM
పట్టుబడుతున్న మద్యం బాటిళ్లు
నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న రాజకీయ పార్టీలు
పోలింగ్‌కు ముందు రోజే కీలకం
మందు, విందులతో ఫుల్ జోష్
మెదక్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి) : ఎన్నికలో మద్యాన్ని, డబ్బులు పంపిణీ చేస్తే కటిన చర్యలు ఉంటాయనే ఎన్నికల కమిషన్ మాటలను రాజకీయ పార్టీల నాయకులు బేఖాతర్ చేస్తున్నారు. ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో జిల్లాలోని ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు డబ్బులు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమంగా మద్యాన్ని పంపిణీ చేసేందుకు తరలిస్తున్న మద్యం, డబ్బు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో ఆయా రాజకీయ పార్టీలు ఒ కరికి సంబంధించిన మద్యాన్ని మరో పార్టీ నాయకులు అధికారులకు సమాచారం అం దించి పట్టుబడేలా చూస్తున్నారు. కాగా మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రా న్, రామాయంపెట్ మున్సిపాలిటీలో గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీలతో పాటుగా పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడం తో రాజకీయ పార్టీలు మద్యం, డబ్బు పం పిణీ పై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది.ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు నేరుగా పంపిణీ చేయకుండా కింది స్థాయి కార్యకర్తలతో పంపిణీ చేయిస్తున్నారు.
కుల సంఘాలే టార్గెట్...
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో కుల సంఘాల నాయకులను పిలిపించుకొని ఎన్నికలో ఓట్లు వేస్తే ఏవీ అడిగిన ఇవ్వడానికి సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు మహిళలు, యువత, ప్రైవేట్ ఉద్యోగులతో వేర్వే రుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఓటు వేయాలని కోరుతున్నారు. అంతేకాదు హైదరాబాద్ లో ఉంటున్న ఓటర్లకు రూ.2 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం.
లక్షల్లో ఖర్చు ..
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు మందు పంపిణీ కోసం అభ్యర్థుల అనుచరులు ఏర్పాట్లు చే స్తున్నారు. గడిచిన వారం రోజులుగా మ ద్యం సరఫరా ఆగడం లేదు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు లక్షలు ఖర్చు చే స్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మహిళలు రూ.300లతో పాటు చికెన్ భోజనం పెడుతున్నారు. ముఖ్యమైన వ్యక్తులు, కుటుంబాలకు మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు.