బోధన్ శ్మశానవాటిక నిధుల రగడపై ‘లోకాయుక్త’ విచారణ
- బోధన్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త విచారణ చేపట్టింది.
బోధన్,(విజయక్రాంతి): బోధన్ (మున్సిపాలిటీ 16వ వార్డు ఎస్సీ శ్మశానవాటిక అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై కొన్నాళ్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం ‘లోకాయుక్త’ సభ్యులు బోధన్ పట్టణాన్ని సందర్శాంచారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
లోకాయుక్త కమిషనర్ జైపాల్, అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. 2018లో ప్రహరీ నిర్మాణంలో రూ.7.80 లక్షలు, 2023లో ‘పట్టణ ప్రగతి’ కింద టాయిలెట్ల కోసం కేటాయించిన రూ.4.43 లక్షలు పనులు చేయకుండానే మున్సిపల్ నిధులు కాజేశారని మాజీ కౌన్సిలర్ టి.రాజవిఠల్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై లోకాయుక్త క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. గతంలో మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కూడా ఇదే అంశంపై విచారణ చేపట్టారు. లోకాయుక్త కమిషనర్తో పాటు బోధన్ మున్సిపల్ ఛైర్పర్సన్ తూము పద్మ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






