మార్కెట్ బంద్ కు పిలుపునిచ్చిన సేల్ ట్యాక్స్ అధికారులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యాపారులు తమ వ్యాపార దుకాణాలను మూసివేశారు. బుధవారం 11 గంటల వరకు వ్యాపార దుకాణాలు తెరిచిన వ్యాపారులు ఒకేసారి మూసివేశారు. దుకాణాలు ఎందుకు మూసి వేస్తున్నారని మారుమూల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమకు నిత్యావసర సరుకులు, బట్టలు, తదితర సరుకులు కావాలని వ్యాపారులను కోరిన దుకాణలు మూసివేశారు.
దుకాణాలు ఎందుకు మూసివేస్తున్నారని మండల ప్రజలు ఆరా తీయగా వ్యాపార దుకాణాలు తనిఖీ చేసేందుకు సేల్స్ టాక్స్ అధికారులు తనిఖీ కోసం వచ్చారని, వ్యాపార దుకాణంలో తనిఖీ చేస్తే ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ ( పన్నులు) చెల్లించలేదని బయటపడితే తమపై కేసులు నమోదవుతాయని భయంతో వ్యాపార దుకాణంలో బందు చేశారు. ప్రభుత్వానికి టాక్స్ లు చెల్లించకుండా ప్రభుత్వానికి జీఎస్టీ తో పాటు అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం.
ఇక్కడి ప్రజలను అధిక ధరలతో సరుకులను అమ్ముతూ సొమ్ము తీసుకుంటున్న వ్యాపారులు అధికారులకు ఎందుకు భయపడుతున్నారని ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇన్ని రోజులు తమను ప్రభుత్వ టాక్స్ ల పేరుతో దోపిడీ చేశారా అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకున్నారు. దుకాణంలో కొత్త బట్టలు గాని, నిత్యవసర సరుకులు గాని కొనుగోలు చేస్తే బిల్లులు ఇవ్వడం లేదంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లే అని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అధిక ధరలకు సరుకులు అమ్మకుండా అధికారులు నిగా పెట్టి పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.






