09-02-2026 12:22:58 AM
మాజీ మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8 :మోసకారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మరింత మోసపోతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టేసి ఓట్లు దండుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆదివారం జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల అభ్యర్థుల గెలుపు కోసం కార్నర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన కెసిఆర్ ను బూతు మాటలు తిట్టేందుకే సమయం సరిపోతుందని తెలిపారు.
కెసిఆర్ తెచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేస్తే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, ఎన్నికల ఇంచార్జ్ దేవి ప్రసాద్, నామ రవి కిరణ్, అంజిమ్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు.