5 August, 2026 | 6:11 PM

తల్లిపాల విశిష్టతపై అవగాహన

05-08-2026 05:16 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జనకాపూర్-1,2,3,4 అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిశువులకు పుట్టినప్పటి నుంచి తొలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలు శిశువుల ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని వివరించారు.

ఈ సందర్భంగా సిడిపిఓ రేణుక మాట్లాడుతూ తల్లిపాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి, ప్రతి తల్లి తప్పనిసరిగా శిశువుకు తల్లిపాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పెంటు బాయి, అంగన్వాడి టీచర్లు అరుణ, ఇంద్ర, విజయలక్ష్మి, రాజమ్మ, దేవమ్మ, భాగ్యక్కతో పాటు తల్లులు పాల్గొన్నారు.