5 August, 2026 | 6:19 PM

సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం

05-08-2026 05:07 PM

మెనిఫెస్టోలో పెట్టిన అంశాలు అమలు చేయక పోతే సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం 

 పీఆర్టీయుటీఎస్ జిల్లా  ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్  డిమాండ్ 

మహా ముత్తారం,(విజయక్రాంతి): మేనిఫెస్టోలో పెట్టిన ఉపాధ్యాయ అంశాలని ప్రభుత్వం పరిష్కరించని పక్షం లో సెప్టెంబర్ 1 నుండి ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం  చుట్టాన్నట్లు  పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టీయు ధ్యేయం అని జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ అన్నారు. మహముత్తారం మండలంలో  ములుగు పల్లి ఉన్నత  ప్రాథమిక పాఠశాల, కొర్లకుంట యూపీఎస్, మోడల్ స్కూల్ దొబ్బలపాడు మహా ముత్తారం ,నిమ్మగూడెం ,యామన్ పల్లి కే జి బి వి పాఠశాలల్లో టీచర్లచే సభ్యత్వ నమోదు చేయించారు.

మహాముత్తారం మండల అధ్యక్షుడు భుక్య రవి నాయక్ అధ్యక్షతన ఆయా స్కూల్స్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ప్రోగ్రెసివ్  రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ కుమార్ హాజరై సంఘ నిర్మాణం కొరకు ,రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పిఆర్టియు సంఘంలో సభ్యత్వం స్వీకరించాలని కోరారు. ఉపాధ్యాయులందరికీ వెంటనే క్యాష్ లెస్ హెల్త్ కార్డులను  వచ్చేలా మన సంఘం కృషి చేస్తుందని తెలిపారు.

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే సిపిఎస్ రద్దు అయ్యేలా ముఖ్యమంత్రి నికలిసి సిపిఎస్ రద్దుచేసి వారికి పాత పెన్షన్ వర్తింపజేసేలా రాష్ట్ర సంఘం  కృషి చేస్తుందని, అదేవిధంగా మిగిలిన సిపిఎస్ ఉపాధ్యాయులందరికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలియజేసిన విధంగా అందరికీ  సి పిఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ,పాత పెన్షన్ విధానాన్ని అమలయ్యే లా ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు.సెప్టెంబర్ 1 న హైదరాబాద్ లో జరిగే మహా ధర్నాకు టీచర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు .కే జి బి వి ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతామని అన్నారు. 

ఉద్యోగులకు హక్కుగా 6 నెలలకు ఒకసారి రావాల్సిన డి ఏ లు 5  పెండింగ్ లో ఉండడాన్ని తప్పు పడుతూ,  పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఏలను వెంటనే మంజూరు చేయాలని, రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి ని , మంచి  ఫిట్మెంట్ తో పిఆర్సి ప్రకటించి వెంటనే అమలు చేయాలనిప్రభుత్వాన్ని కోరారు. ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా రవీందర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి మహా ముత్తారం హెచ్ ఎం ఏ సురేందర్ రెడ్డి , జిల్లా బాధ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద మండల బాధ్యులు కొంకల గీతారెడ్డి, చైతన్య నాగరాజు ,సతీష్ కుమార్,షరీఫ్ సుధాకర్ రెడ్డి  లావుడ్య ప్రకాష్ లతోపాటు వివిధ మండల ,జిల్లా ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు...