28 July, 2026 | 1:12 AM

క్రికెట్ టోర్నీ విజేతగా తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల టీమ్

28-07-2026 12:30 AM

అభినందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం,  జూలై ౨౭ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ స్పోరట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కాలేజీ మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోరట్స్ జర్నలిస్టుల జట్టుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా హెచ్‌ఎంటీవీ ప్రతినిధి మానుకొండ రవికిరణ్‌ను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులోనూ తెలంగాణ స్పోరట్స్ జర్నలిస్టుల జట్టు ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.