28 July, 2026 | 2:01 AM

ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడింది

28-07-2026 01:11 AM

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ‘హైడ్రా అనేది హైదరాబాద్ ప్రజలకు అవసరం. అనేక చెరువులు, కుంటలు, నాళాలను కబ్జాల నుంచి హైడ్రా కాపాడింది. లే అవుట్, పార్కులు, రోడ్లు కబ్జాలను హైడ్రా పరిరక్షించింది. హైదరాబాద్‌లో మున్సిపల్, పోలీస్, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం హైడ్రాతో సాధ్యమైంది’ అని భువనగిరి ఎం పీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వారు విచ్చలవిడిగా కబ్జాలు చేసి పేద, మధ్య తరగతి వారికి ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్స్ అమ్మారని ఆరోపించారు. మోసపోయిన వారు 1 నుంచి 2 శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 98 శాతం ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించాలి కదా అన్నారు. హైడ్రా కమిషనర్ ఏ రాజకీ య ఒత్తిళ్లకు నిర్ణయాలు తీసుకున్నారో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలన్నారు.