28 July, 2026 | 2:01 AM

ఆర్ కృష్ణయ్య కాదు.. బీజేపీ కృష్ణయ్య!

28-07-2026 01:07 AM
  1. ప్రభుత్వ విద్యకు సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట
  2. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య     

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఆర్ కృష్ణయ్య బీసీ బిడ్డగా కాదు.. బీజేపీ కృష్ణయ్యగా మారుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆరోపించా రు. తెలంగాణను ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్యకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. పేదలకు కార్పొరేటర్ విద్యను అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తున్నారని, అందుకే విద్యాశాఖను సీఎం రేవంత్‌రెడ్డినే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీ డియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రభు త్వ విద్య దేశంలోనే చివరి స్థానంలోకి వెళ్లిందన్నారు. బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి ప్రభుత్వంపైన విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ఆర్ కృష్ణయ్య విద్యార్థుల కో సం గతంలో అనేక పోరాటాలు చేశారని, కానీ కేసీఆర్ హయాంలో బకాయిలపైన ఏ నాడు కూడా ఆయన మాట్లాడలేదని విమర్శించారు.