ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది
తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
శంకర్ పల్లి ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది తెలంగాణ రాష్ట్ర సభాపతి (స్పీకర్) గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు, బుధవారం మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ ఉద్యోగ విరమణ కార్యక్రమం బద్దం సురేందర్ రెడ్డి గార్డెన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల విద్యాధికారికి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగ విరమణ సర్వ సాధారణమన్ అని అన్నారు. అక్కడ పని చేసిన గుర్తింపు పొందేలా పని చేసి పేద విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. శంకర్ పల్లి మండలంలో 2015 జులై 10 న జన్వాడ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదవి బాధ్యతలు చేపట్టి, మండల విధాధికారి గా అదనపు బాధ్యతలు చేపట్టి సుదీర్గంగా అధికార విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కొనియాడారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ ఎస్ గి టి గా 1989 సెలెక్ట్ అయి నేటికీ 41 సంవత్సరాలు పూర్తి చేశారని కొనియాడారు. జిల్లా విద్యాధికారి శుశింద్ర రావు మాట్లాడుతూ అక్బర్ పదవి విరమణ తర్వాత తన శేష జీవితం సుఖంగా-ఆరోగ్యంగా ఉండాలని, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల టి ఆర్ ఎస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చిన్న నర్సింలు, గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, మండలం లోని ఉపాద్యాయులు పాల్గొన్నారు.






