13 July, 2026 | 3:09 AM

కమిటీల కుంపటి

13-07-2026 02:15 AM
  1. గజ్వేల్ కాంగ్రెస్‌లో వర్గపోరు
  2. పీసీసీ వర్సెస్ తూంకుంట నర్సారెడ్డి
  3. అధిష్ఠానం నిర్ణయాలకు సమాంతర రాజకీయం
  4. సొంతంగా మండల కమిటీల ప్రకటన
  5. క్యాడర్‌లో అయోమయం అధిష్ఠానం వద్దకు పంచాయితీ.. పీసీసీ అధ్యక్షుడు సీరియస్!

సంగారెడ్డి, జూలై 12 (విజయక్రాంతి):  సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాం గ్రెస్ పార్టీలో మండల కమిటీల నియామకం అంతర్గత విభేదాలకు దారితీ సింది. టీపీసీసీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన కమిటీలపై స్థానిక సీనియర్ నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీలో వర్గపోరు బహిర్గత మైంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఉత్తర్వుల మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో నూతన మండల, టౌన్ కాం గ్రెస్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ నియామకాలపై గజ్వే ల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్,మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తనను సంప్రదించకుం డా ఏకపక్షంగా కమిటీలను ఎలా వేస్తారని ఆయన అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. 

చిచ్చురేపిన సొంత కమిటీలు..

ముఖ్యంగా తూప్రాన్, మనోహరాబాద్ మండల కమిటీల నియామకం ఈ వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి. పీసీసీ ప్రకటించిన జాబితాకు వ్యతిరేకం గా నర్సారెడ్డి తన అనుచరులతో ఇమాంపూర్‌లో అత్యవసర సమావేశం నిర్వ హించి, సొంతంగా వేరే కమిటీలను ప్రకటించారు. పీసీసీ ఒక వైపు, నియోజక వర్గ ఇన్‌చార్జ్ మరోవైపు వేర్వేరు కమిటీలను ప్రకటించడంతో అసలైన కమిటీ ఏదో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి.

పార్టీని నమ్ముకున్న పాత నాయకులను కాదని, ఇటీవల చేరి న ఇతర వర్గాల వారికి, ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులకు ప్రాధాన్యమిస్తున్నారనే భావన వర్గపోరును మరింత రాజేసింది. గజ్వేల్ కాంగ్రెస్‌లో ప్రధానంగా మూడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జ్, జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఇక్క డ బలమైన వర్గం నడుపుతున్నారు.

నియోజకవర్గంలో పార్టీ తన కనుస న్నల్లోనే నడవాలన్నది ఆయన భావన. సీనియర్ నేత బండారు శ్రీకాంత్‌రావు, యువ నాయకుడు జస్వంత్‌రెడ్డి కలిసి ఒక గ్రూప్‌గా నర్సారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పరిశీలకుడిగా వచ్చిన మాజీ ఎమ్మె ల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం ఇక్క డ సొంతంగా మరో గ్రూపు తయారు చేశారనే ప్రచారం ఉంది.  కాగా నర్సారెడ్డి గతం లో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్)లోకి వెళ్లి, మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చారని.. ఆయన ఇప్పటికీ బీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉంటూ కోవర్టుగ్గా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. 

పార్టీ కార్యక్రమాల్లో నర్సారెడ్డి అనుచరులు తమపై భౌతిక దాడులకు పాల్పడు తున్నారని శ్రీకాంత్‌రావు, జసంత్ రెడ్డి వర్గా లు రాష్ట్ర అధిష్ఠానానికి ఫిర్యాదు చేశాయి. పీసీసీ అధికారికంగా నియమించిన మం డల కమిటీలను ధిక్కరించి, సొంతంగా కమిటీలు వేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘి స్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలావుండగా తానే అసలైన ఇన్‌చార్జ్ అని, ఎన్నికల్లో తానే కష్టపడ్డానని, కేవలం రాజకీయ ఉనికికోసం శ్రీకాంత్‌రావు, జస్వంత్‌రెడ్డి తనపై నిందలు వేస్తున్నారని నర్సారెడ్డి వర్గం అంటుంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న తనను సంప్రదించకుండా, ఇతర వర్గాల ఒత్తిళ్లకు తలొగ్గి పీసీసీ ఏకపక్షంగా మండల కమిటీలను నియమించిం దని నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తుంది.  

ఢిల్లీ వెళ్లే యోచనలో నర్సారెడ్డి వర్గం..

నర్సారెడ్డి తన అనుచరులతో కలిసి అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు.  తాను ప్రకటించిన కమిటీలనే కొనసాగించేందుకు నర్సారెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తనను సంప్రదించకుండా పీసీసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. కాగా గజ్వేల్ తాజా పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌తో పాటు, ఏఐసీసీ పెద్దలకు  ర్యాదు చేసేందుకు నర్సారెడ్డి వర్గం ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

సిద్దిపేట జిల్లాపై పట్టుకోసమేనా?

గజ్వేల్‌తో పాటు సిద్దిపేట జిల్లా వ్యాప్తం గా పట్టు పెంచుకునేందుకు నర్సారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నర్సారెడ్డి కూతురు తూంకుంట ఆకాంక్షరెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా ఉన్నందున, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గానికే ప్రాధాన్యత దక్కేలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అధిష్ఠానం నిర్ణయాలను ధిక్కరించి నట్లుగా ప్రచారం సాగుతోంది.

నర్సారెడ్డి వర్గం తీరుపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తీవ్రంగానే స్పందించారని, మితిమీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. పీసీసీ ప్రకటించిన కమిటీలకే అధికారిక గుర్తింపు ఉంటుందని, నర్సారెడ్డి అనుచరులు వేసిన పోటీ కమిటీలను చెల్లవని ప్రకటించే అవకాశాలు ఉన్న ట్లు విశ్వసనీయంగా తెలిసింది.