2 September, 2026 | 8:56 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఆ పెద్దాయన చెప్పిన కథే మా సినిమా

30-04-2026 | 01:56am

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వరాహ మూవీ మేకర్స్ పతా కంపై జయశంకర్‌రెడ్డి ఎం, పాటిమీది సంతోష్ నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు సువిక్షిత్ మాట్లాడుతూ.. “అరుణాచలంలో భిక్షాటన చేస్తున్న ఓ పెద్దాయ నతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్ స్టోరీనే ఈ సినిమా.

ఈ సినిమా టికెట్‌పాటు కర్చిఫ్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఈ సినిమా చూసి ఏడ్వకుండా ఎవరూ ఉండలేరు. ఏడవకుండా ఉన్నవాళ్ల లైఫ్‌ను నేను సెటిల్ చేస్తా” అన్నారు. హీరోయిన్ గీతికాదాస్ మాట్లాడుతూ.. “తప్పకుండా అందరి హృదయాలను మెలిపెడుతుంది. ఇలాంటి ప్రేమకథలు చాలా అరుదుగా వస్తాయి” అని తెలిపారు. “అందరూ ఇది కేవలం  లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలున్నాయి’ని దర్శకుడు కార్తికేయ చెప్పారు. నటీనటులు జెమిని సురేశ్, లావణ్యరెడ్డి, కిట్టయ్య కూడా మాట్లాడారు.