2 September, 2026 | 9:36 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

అలెల్లె.. కలిసే ఎదలే..

30-04-2026 | 01:59am

జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో ’శ్రీనివాస మంగాపురం’తో హీరోగా పరిచయమవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. మోహన్‌బాబు కీలక పాత్ర లో అలరించనున్నారు. అశ్వినిదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘అలెల్లె అలెల్లె’ను లాంచ్ చేశారు. ‘అలెల్లె.. అలెల్లె.. అదిరే కలలే.. అలెల్లె.. అలెల్లె.. కలిసే ఎదలే.. పీల్చే శ్వాసలాగా మార్చుకోరా నన్నిలా.. కాలం చివరిదాకా నడిచి రారా తోడుగా..’ అంటూ సాగుతోందీ గీతం. శ్రీమణి రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్‌కుమార్ కంపోజ్ చేయడమే కాక హరిప్రియతో కలిసి పాడారు.