3 June, 2026 | 1:34 AM

రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి!

03-06-2026 01:25 AM
  1. కాంగ్రెస్ పాలనలో మోసపోనివర్గం లేదు
  2. కుక్కలు చింపిన విస్తరిగా రాష్ట్రం
  3. సంక్షోభంలో వ్యవసాయరంగం
  4. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 
  5. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లలోనే తెలంగాణను 25 ఏళ్ల వెనక్కి నెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేస్తున్నాడని మండిపడ్డా రు. అధికారంలోకి వచ్చి సరిగ్గా సగం సమ యం అయిపోయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్ర భుత్వం చేసింది ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గం అంటూ ఏదీ లే దని, ఇప్పుడు వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ‘రైతుబంధు లేదు, ఎరువుల ఇచ్చేటోళ్ళు లేరు, చివరికి పండించిన పంట కొనే దిక్కు లేదు. ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్యం చూస్తుంటే బాధ అవుతున్నది. పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో ఈరోజు పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారు’ అని చెప్పారు.

తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. దశాబ్దాల పోరాటం ఫలించినరోజే జూన్ 2 అని, ఈరోజు కేసీఆర్ జీవిత చరిత్రలో ప్రముఖమైన రోజు అని అన్నారు. తెలంగాణ కోసం ఎత్తిన జెండాను దింపేదిలేదని కేసీఆర్ ఆనా డే చెప్పారని గుర్తుచేశారు. ౨౦౨౮ డిసెంబర్‌లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ప్రజలే చెబుతున్నారన్నారు.

గత ప్రభుత్వంపైన, కేసీఆర్‌పైన చిల్లర ప్రచారాలు చేసి, అబద్ధాలతో కూడిన విష ప్రచారాలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో 420 హామీల రూపం లో చెప్పి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని కేటీఆర్ చెప్పారు. దేశమంతా వదిలించుకున్న దరిద్ర కాంగ్రెస్, తెలంగాణకు వచ్చిందన్నా రు. కేసీఆర్‌ను బద్నామ్ చేయాలన్న ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పగబట్టిందని చెప్పారు.

కృష్ణా గోదావరి జలాలను గురువుగారికి సంతర్పణ చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని విమర్శించాడు. ‘నాలుగు సార్లు రైతుబంధు ఎగ గొట్టిన నయవంచకుడు రేవంత్‌రెడ్డి. యూ రియా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. పంటలు కొనలేని సన్నా సి రేవంత్‌రెడ్డి అని 70 లక్షల తెలంగాణ రైతన్నలు రేవంత్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతు న్నారన్నారు.  ఈ సందర్భంగా మరో ప్రజా పోరాటానికి, తెలంగాణ కోసం సిద్ధం కావాలని కేటీఆర్, పార్టీ నేతలు ప్రతిజ్ఞ కలిసి చేశారు.