10 August, 2026 | 3:10 AM

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు అందించాలి

10-08-2026 01:47 AM

బండి రమేష్

కూకట్‌పల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి ):భారత స్వాతంత్రద్యమం లో క్విట్ ఇండియా ఉద్యమం అత్యంత కీలక ఘట్టమని,స్వాతంత్ర సమారయోధుల ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలిసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని టిఫిసిసి ఉపాధ్యక్షులు,కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అన్నారు.ఆదివారం గాంధీ భవన్ వద్ద పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ అద్వర్యం లో నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి కార్యక్రమానికి కూకట్ పల్లి నుండి బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.

ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ నాయకత్వం లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమం దేశ ప్రజల్లో ఐక్యత,దేశ భక్తి, త్యాగ స్ఫూర్తిని నింపిందన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాల స్ఫూర్తితో దేశాభివృద్ధి, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు.ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.