10 August, 2026 | 3:07 AM

పోటెత్తిన భక్తజనం

10-08-2026 01:49 AM
  1. సిటీలో ఉదయం నుంచే కిక్కిరిసిన ఆలయాలు
  2. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రజాప్రతినిధులు

సికింద్రాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ ఆధ్యాత్మిక సాంస్కృతిక విశిష్టత ప్రతిబింబించే పండుగలలో బోనాల జాతర ఒకటి.ఆషాఢమాసంలో కొన్ని చోట్ల,శ్రావణ మాసంలో కూడా నిర్వహించుకునే బోనాల జాతర ఘనమైన ఉత్సవంలో సికింద్రాబాద్, కంటోన్మెంట్ పలు ప్రాంతాల్లోమహంకాళి అమ్మవార్లు బోనాల వేడుకలు ఇవాళ ఉద యం నుంచి ఘనంగాకొనసాగుతున్నాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో భాగ్యనగర మంతా అమ్మవారి బోనాలతో ప్రత్యేక శోభ సంతరించు కుంది.

నగరంలోని పలు ప్రాంతాల్లో కొలువైన కట్ట మైసమ్మ,నల్ల పోచమ్మ,శ్రీశ్రీశ్రీ మహంకాళి,  బంగారు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, భవాని, ఏడుగుళ్ళు దుర్గామాత, మహంకాళి ముత్యాలమ్మ, తదితర అమ్మవార్ల ఆలయాలకు బోనాలు సమర్పించేందు కు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. మహిళలు పసుపు,కుంకుమ వేపాకులతో అలంకరించిన బోనాలు నెత్తినపెట్టుకుని, అమ్మవార్ల ఆలయాలకు బయలు దేరారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,

బెల్లం సాకపోసి బోనం నైవేద్యంతో పాటు గాజులు, చీరెసారె సమర్పించి చల్లంగ చూడాలని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్,కంటోన్మెంట్ బోర్డ్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్,తార్నాకలో నల్ల పోచమ్మ అమ్మ వారిని దర్శించుకున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు,

సికింద్రాబాద్లో ఎమ్మెల్యే తీగుళ్ళ పద్మారావు గౌడ్,న్యూ బోయిన్ పల్లి లో ఏడు గుళ్ళు దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్,

మాజీ ఉపాధ్యక్షుడు జక్కలు మహేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, బోయిన్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్. శ్రీనివాస్, మాజీ కమిటీ సభ్యుడు దేవులపల్లి శ్రీనివాస్, కూకట్  పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్,కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్,వారి,వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి,అమ్మవార్ల ఆశీర్వాదం పొందినారు.