11 June, 2026 | 2:32 AM

తండ్రిని చంపిన కొడుకు

11-06-2026 01:19 AM

జనగామ, జూన్ 10 (విజయక్రాంతి): క్షణికావేశంలో తండ్రిని కొడుకు రోకలిబండతో కొట్టి చంపిన ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన జంగిటి రమేష్ (42) మంగళవారం రాత్రి తన తల్లిదండ్రుల వద్ద నాటుకోడి తెచ్చి కూర వండాలని భార్య అనూషకు చెప్పాడు.

కోడి కూర ఇప్పుడు వండను అని ఆమె చెప్పడంతో భార్యను దుర్భాషలాడాడు. దీంతో కొడుకు గణేష్ అమ్మని ఎందుకు తిడుతున్నావని తండ్రిని అడిగాడు. కొడుకును కూడా రమేష్ తిడు తూ కొట్టాడు. క్షణికావేశానికి లోనైన గణేష్ పక్కనే ఉన్న రోకలి బండతో రమేష్ తల పైన  కింద పడిపోయాడు. స్థానికులు అతన్ని జనగామ ఆసుపత్రికి  తరలించారు. బుధవారం హైదరాబాద్ ఉ స్మానియాకి  తరలిస్తుండగా  రమేష్ మార్గమధ్యంలో మృతి చెందాడు. రమేష్ సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మే రకు ఎస్సై శ్రీదేవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.