23 August, 2026 | 11:14 PM

వల్లపు సోమయ్య మృతికి నివాళి

23-08-2026 09:50 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు23: మండల పరిధిలోని కోడూరు గ్రామ సర్పంచ్ వల్లపు అవిలమ్మ భర్త వల్లపు సోమయ్య మృతి బాధాకరమని,ఆయన లేని లోటు తీర్చలేనిదని,తెలంగాణ ఉద్యమకారుడు,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందిన సోమయ్య పార్థివదేహాన్ని కోడూరు గ్రామంలో సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి,ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్,తెలంగాణ సర్పంచుల ఫోరం జేఏసీ జిల్లా అధ్యక్షుడు వల్లపు గంగయ్య,వివిధ గ్రామాల సర్పంచులు బొడ్డు ఇందిరాసోమరాజు,నున్న యాదగిరి యాదవ్,కేలోతు కాంతమ్మహరిలాల్,కలకోట్ల శైలేందర్,మాజీ సర్పంచ్ శ్రీరాముల పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.