తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
సినీనటుడు బాబుమోహన్
ముషీరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాం తి): ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కోరారు. కొండాపూర్లో అంతర్జాతీ య ప్రమాణాలు, ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన చిరంజీవి వెరికోస్ వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆదివారం ప్లానింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ భోపాల్ గజరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ స ందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ వె రికోస్ వెయిన్స్, రక్తనాళాల సమస్యలు, ఇత ర వాస్కులర్ వ్యాధులకు ఆధునిక వైద్య వి ధానాలతో నాణ్యమైన చికిత్స అందించడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ కె. సంజీవరావు, డాక్టర్ శిల్ప పొన్నాడ, డాక్టర్ కె. వంశీకృష్ణ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, రంగస్థల దర్శకుడు ఈ. సముద్ర, వీరభద్ర చౌదరి, తెలంగాణ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అన్నంగి రాజశేఖర్, నిర్మాత మిత్తాన ఈశ్వర్, హీరోయిన్ సైనిక తదితరులు పాల్గొన్నారు.






