23 August, 2026 | 8:49 PM

అలరించిన కళాప్రదర్శనలు

23-08-2026 08:33 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి సింగరేణి కళావేదికలో జరిగిన కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి, సంఘం రాష్ట్ర కార్యదర్శి అనుమాండ్ల మధుకర్  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుస్సాడి, చిందుయక్షగానం,వీధిభాగవతం,కోలాటం,బైండ్ల,డప్పులు,తెలంగాణ సన్నాయి ,బోనాలు,ఒగ్గుకథ,భజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. 350 మంది కళాకారులు తమ కళాప్రదర్శనలతో అలరింప చేశారు. ఈ సందర్భంగా వంగ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జానపద కళలను జానపద వృత్తి కళారూపాలను బ్రతికించాలనే ఉద్దేశంతో రాష్ట్ర జానపద కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేయడమైందన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ దావా స్వాతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు కొదవలేదన్నారు. కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు మిట్ట లక్ష్మణ్ పటేల్, అధ్యక్షులు చొప్పదండి కిషన్,ప్రధాన కార్యదర్శి బబ్బెర రాజేందర్,వర్కింగ్ ప్రెసిడెంట్ రవికిరణ్, మహిళా అధ్యక్షురాలు దుర్గం లక్ష్మి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మిట్టురవి, కొమరం భీం జిల్లా అధ్యక్షుడు రాజబాబు  కళాకారులు పాల్గొన్నారు.